*_జీవితంలో అత్యంత అందమైన సంబంధాలలో స్నేహం ఒకటి._*
*_ఎలాంటి రక్తసంబంధం లేకుండా ఒకరి కోసం ఒకరు అన్నట్టు జీవించేలా చేసేదే స్నేహబంధం._*
*_అమ్మా నాన్నని మనం ఎంపిక చేసుకోలేం,కానీ స్నేహితులను మాత్రం మనం ఎంపిక చేసుకోగలం._*
*_మనం నవ్వినా,ఏడ్చినా,గొడవ పడినా అది స్నేహంలో అందమైన అనుభవాలే._*
*_స్నేహమంటే ఒక నమ్మకం...ఒక భరోసా నాకు ఎం జరిగినా నా దోస్త్ ఉన్నడులే అని ధైర్యంగా చెప్పుకోవడానికి నలుగురిని సంపాదించుకోమని పెద్దలు చెప్పారు.._*
*_స్నేహం అద్భుతమైంది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు. అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది. వికాసానికి బాటలు వేస్తుంది._*
*_మంచి మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది.జీవితమనే ఉద్యానవనంలో అందమైన పుష్పం స్నేహం'._*
*_హృదయపు తలుపును ఒక్కసారి తడితే.. అందులోని మాధుర్యమంతా ప్రతి హృదిలో గుబాళిస్తుంది. ప్రతిఫలాన్ని ఆశించని ఆ బంధం మొగ్గలా ప్రారంభమై.. మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది.._*
*_కాబట్టి ఆ స్నేహ పరిమళాన్ని ఎంత మీరు విస్తరించుకుంటే అంత విశాలంగా మారుతుంది మన హృదయం.._*
*_గ్రూపులో ఉన్న ఆత్మీయులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.💐💐🌺💐💐🌸💐💐_*
No comments:
Post a Comment